నేటి నుంచి పేదలకు ఉచిత బియ్యం పంపిణీ | Distribution of free rice to the poor from today in AP | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పేదలకు ఉచిత బియ్యం పంపిణీ

May 1 2021 4:30 AM | Updated on May 1 2021 4:30 AM

Distribution of free rice to the poor from today in AP - Sakshi

గుడివాడ టౌన్‌: కరోనా నేపథ్యంలో పేదవారిని ఆదుకోవాలనే దృక్పథంతో శనివారం నుంచి ప్రతి ఒక్కరికి 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 10 కిలోలు సార్టెక్స్‌ స్వర్ణరకం మధ్యస్త సన్నబియ్యం పంపిణీ  చేస్తామన్నారు.

మే, జూన్‌ నెలల్లో ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ. 800 కోట్లు వెచ్చించిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్లు బియ్యం కార్డులున్నాయన్నారు. వారందరికీ ఉచిత బియ్యం అందిస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement