సూర్యప్రభ వాహనంపై శ్రీవారు.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Devotees Has Increased In Tirumala Over Srivari Brahmotsavam | Sakshi
Sakshi News home page

సూర్యప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Sep 24 2023 8:42 AM | Updated on Sep 24 2023 1:23 PM

Devotees Has Increased In Tirumala Over Srivari Brahmotsavam - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఏడో రోజు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా సూర్యప్రభ వాహనంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు పాల్గొన్నారు. ఇక, స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పడుతున్నారు. 

కాగా, ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. ఇక, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం ఉండనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ ఉండనుంది. 

మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,884గా ఉంది. నిన్న హుండీ ఆదాయం 2.70 కోట్లుగా ఉంది. ఇక, 32,213 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement