అల్లూరికి సేవలందించిన శతాధిక వృద్ధుడి మృతి

Death Of A Centenarian Who Served Alluri Sitarama Raju - Sakshi

రాజవొమ్మంగి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సేవలందించిన ఓ శతాధిక వృద్ధుడు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన బీరబోయిన బాలుదొర (111) ఆదివారం తన నివాసంలో మరణించారు. కొండపల్లి కేంద్రంగా అల్లూరి సీతారామరాజు 1924 మే నెలలో బ్రిటిష్‌ వారిపై చివరి పోరాటం చేశారు.

అప్పట్లో బాలుడిగా ఉన్న తాను.. ఎత్తయిన కొండలపై బస చేసిన అల్లూరి సీతారామరాజుకి ఆహార పదార్థాలు అందజేసేవాడినని.. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిందంటూ నాటి స్మృతులను బాలుదొర తమతో పంచుకొనేవారని స్థానికులు తెలిపారు. అయితే వయసు మీదపడటంతో ఇటీవల మంచం పట్టిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top