కరోనా నుంచి కోలుకున్నా.. ఈ సమస్యలు వెంటాడొచ్చు!

Corona sufferers are 44 percent more likely to have neurological or psychological problems - Sakshi

కరోనా బాధితులకు నరాల, మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు 44 శాతం అధికం

శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం 16 శాతం అధికం

17 శాతం మందిలో మానసిక సమస్యలు

2 శాతం మందికి చిత్త వైకల్యం కూడా..

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి

సాక్షి, అమరావతి: ‘కరోనా బారినపడి కోలుకున్న తరువాత కూడా వివిధ అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంది. కాబట్టి కరోనా బాధితులు వారి ఆరోగ్య పరిరక్షణ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది’ అని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా నరాల సంబంధ వ్యాధులు, మానసిక రుగ్మతల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనం చెబుతోంది. కరోనా నుంచి కోలుకున్న 2,36,379 మంది ఆరోగ్య స్థితిగతులను విశ్లేషించిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఈ నివేదికను వెల్లడించింది. ప్రఖ్యాత ‘లాన్సెట్‌ సైకియాట్రి’ జర్నల్‌ ప్రచురించిన ఆ నివేదికలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.

మూడోవంతు మందికి..
► కరోనా నుంచి కోలుకున్న వారిలో మూడోవంతు మంది నరాల సంబంధిత, మానసిక రుగ్మతల బారినపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఫ్లూ వంటి ఇతర వ్యాధుల నుంచి కోలుకున్న వారితో పోలిస్తే కరోనా బాధితులు ఈ రెండు సమస్యల బారిన పడే అవకాశాలు 44 శాతం అధికం. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు 16 శాతం అధికం.
► అధ్యయనం చేసిన 2,36,379 మందిలో 1,05,579 మంది ఇన్‌ప్లూయెంజా వైరస్, 2,36,038 మంది శ్వాసకోశ నాళంలో ఇన్ఫెక్షన్‌ బారిన పడ్డారు. వీరిలో 17 శాతం మంది మానసిక రుగ్మతలతో, 14 శాతం మంది ఒత్తిడితో సతమతం అవుతున్నారు.
► వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో 7 శాతం మందికి గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి. 2 శాతం మంది మానసిక వైకల్య సమస్యల్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఇలా కావడానికి ప్రధాన కారణం ఏమిటన్నది కచ్చితంగా నిర్ధారించనప్పటికీ.. మానసిక ఆందోళన, ఉద్యోగ భద్రత లేకపోవడం, దీర్ఘకాలం క్వారంటైన్‌లో ఒంటరిగా ఉండటం మొదలైనవి ప్రాథమిక కారణాలుగా అంచనా వేశారు. వీటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నివేదిక పేర్కొంది. వీరికి సామాజిక భద్రత, సంరక్షణ కల్పించడం, మేమున్నామనే భరోసా ఇవ్వడం ద్వారా ఆ సమస్యల నుంచి వారిని బయటపడేయవచ్చని నివేదిక అభిప్రాయపడింది. 

మెదడుపై కరోనా ప్రభావం ఎంత!
మెదడుపై కరోనా ప్రభావంపై ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తన నివేదికలో పేర్కొంది. లండన్‌లో కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రిలో చేరిన ప్రతి ఐదు మందిలో నలుగురికి తలనొప్పి, మైకం, కండరాల నొప్పి తదితర లక్షణాలు కనిపించాయి. ఈ వైరస్‌ మొదటిసారిగా బయటపడిన చైనాలోని వూహాన్‌లో 36 శాతం కరోనా రోగుల్లో నరాల సంబంధ సమస్యలు, మగతగా ఉండటం వంటి లక్షణాలు కనిపించాయని నివేదిక తెలిపింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-04-2021
Apr 10, 2021, 08:29 IST
కోవిడ్‌ విస్తరణ బెంగళూరులో వాయువేగంతో సాగుతోంది. రాజధానిలో కొత్తగా 5,576 కేసులు నమోదు అయ్యాయి.
10-04-2021
Apr 10, 2021, 05:59 IST
న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసి కోవిషీల్డ్, భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన...
10-04-2021
Apr 10, 2021, 05:07 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వాస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో వ్యాక్సిన్‌...
10-04-2021
Apr 10, 2021, 04:53 IST
న్యూఢిల్లీ:  దేశంలో కరోనా రోజురోజుకీ ఉధృతరూపం దాలుస్తోంది. వరసగా మూడోరోజు లక్షకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24...
10-04-2021
Apr 10, 2021, 04:02 IST
సాక్షి, అమరావతి: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో నెల రోజుల్లో 22 మంది ఖైదీలకు కరోనా సోకింది. దీంతో జైళ్ల శాఖ...
10-04-2021
Apr 10, 2021, 02:55 IST
సాక్షి, అమరావతి: ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు ‘టీకా ఉత్సవ్‌’ను దిగ్విజయంగా నిర్వహించేందుకు రాష్ట్రానికి వెంటనే 25 లక్షల...
10-04-2021
Apr 10, 2021, 02:50 IST
రైలు సేవలను తగ్గించడానికి కానీ ఆపడానికి  ఎటువంటి ప్రణాళిక లేదని,  అవసరమైతే  పెంచుతామని రైల్వే బోర్డు చైర్మన్‌ సునీత్‌ శర్మ...
10-04-2021
Apr 10, 2021, 02:07 IST
మే 17వ తేదీ నుంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పదో తరగతి విద్యార్థులకు వార్షిక...
10-04-2021
Apr 10, 2021, 01:58 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అదేస్థాయిలో ముందుకెళ్తోంది. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు,...
09-04-2021
Apr 09, 2021, 18:11 IST
అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తికి కరోనా. నాకు కాదు
09-04-2021
Apr 09, 2021, 12:12 IST
కోవిడ్‌ చికిత్స పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, మాస్క్‌ పెట్టుకోని వారి పట్ల కఠినంగా...
09-04-2021
Apr 09, 2021, 11:12 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండోదశలో కరోనా విలయం కొనసాగుతోంది.  రోజు రోజుకు  కొత్త రికార్డు స్థాయిలతో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. ...
09-04-2021
Apr 09, 2021, 10:26 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందన్న కరోనా మరోసారి పంజా విసురుతుండటంతో...
09-04-2021
Apr 09, 2021, 09:01 IST
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌(78) కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల...
09-04-2021
Apr 09, 2021, 08:24 IST
గురువారం 36 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 22 మంది బెంగళూరు వాసులే.
09-04-2021
Apr 09, 2021, 06:33 IST
న్యూఢిల్లీ/ముంబై:  కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సర్కారు మధ్య వివాదం ముదురుతోంది. ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి....
09-04-2021
Apr 09, 2021, 04:35 IST
న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలను కోరారు. వైరస్‌ నియంత్రణలో...
09-04-2021
Apr 09, 2021, 04:21 IST
న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని హడలెత్తిస్తోంది. ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదవుతోంది. గత 24 గంటల్లో...
09-04-2021
Apr 09, 2021, 02:18 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌...
09-04-2021
Apr 09, 2021, 01:39 IST
వెల్లింగ్టన్‌: భారత్‌ కోవిడ్‌–19 హాట్‌ స్పాట్‌గా మారుతూ ఉండడంతో న్యూజిలాండ్‌ భారత్‌ నుంచి ప్రయాణికుల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించింది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top