సకాలంలో భూముల రీ–సర్వే : కలెక్టర్

కశింకోట: సమగ్ర భూముల రీ–సర్వే సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి ఆదేశించారు. కశింకోట పొలాల్లో సర్వే, రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తున్న భూముల రీ–సర్వేను శుక్రవారం ఆయన అకస్మాత్తుగా పరిశీలించారు. రీ–సర్వే పూర్తి చేయడానికి ఆగస్టు నెలాఖరు వరకు సమయముందని, ఈలోగా నిబంధనలకు లోబడి సర్వే పూర్తి చేయాలన్నారు.
అనంతరం బయ్యవరం సచివాలయాన్ని సందర్శించి పనితీరును పరిశీలించారు. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ నెల రోజులపాటు సెలవులో ఉండటంతో ప్రత్యామ్నాయంగా ఎవరినైనా తాత్కాలికంగా నియమించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో చిన్నోడు, తహసీల్దార్ బి.సుధాకర్, ఈవోఆర్‌డీ ధర్మారావు, ఆర్‌ఐ కిషోర్ కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు.
(చదవండి: టీవీ రిపోర్టర్‌నంటూ మహిళపై లైంగికదాడి.. ఆ దృశ్యాలను రికార్డింగ్ చేసి..)