
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు అక్కడికి చేరుకుని ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీదేవి ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం దత్తపీఠాధిపతి స్వామి సచ్చిదానందతో సమావేశమవుతారు.