రేపు వాణిజ్యోత్సవాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌

CM YS Jagan Will Inaugurate Vanijya Utsavam 2021 September 20th - Sakshi

విజయవాడలో రేపు,ఎల్లుండి ‘వాణిజ్య ఉత్సవం-2021’

సాక్షి, అమరావతి: రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విజయవాడలో రేపు, ఎల్లుండి(మంగళ,బుధ) ‘వాణిజ్య ఉత్సవం-2021’ నిర్వహించనున్నారు. వాణిజ్యోత్సవాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు ఎగుమతుల సదస్సు ప్రారంభం కానుంది. ఉదయం 11.15 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను సీఎం జగన్‌ వివరించనున్నారు. (చదవండి: వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం అమలుకు సీఎం జగన్‌ ఆదేశం

వాణిజ్యోత్సవానికి మంత్రులు, అధికారులు హాజరవుతారని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఏపీ నుంచి అత్యంత చౌకగా ఎగుమతులు చేసుకునే అవకాశాలను ఎగుమతుదారులను వివరించే విధంగా ప్రణాళికలను ఏపీ ఈడీబీ సిద్ధం చేసింది. ప్రసుత్తం ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాలుగు ఓడరేవుల ద్వారా 16.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు అవుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ఏపీ ముందడుగు వేస్తోంది. ఏపీ ఎగుమతులకు ఉన్న అవకాశాలను రెండు రోజుల సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించే అవకాశం ఉంది.
చదవండి:
ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top