నేడు పశ్చిమ గోదావరిలో అమూల్‌ పాల సేకరణ 

CM YS Jagan Will Be Launching AP Amul Project In West Godavari - Sakshi

వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

తొలివిడతగా 142 గ్రామాల్లో అమలు  

సాక్షి, అమరావతి: పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టును చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేస్తోంది. శుక్రవారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పాల సేకరణ మొదలు పెట్టబోతోంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. అమూల్‌ సంస్థ ఇప్పటికే చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాలు సేకరిస్తోంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి విడతగా 142 గ్రామాల్లో పాలు సేకరించనుంది.

పాల నాణ్యత, వెన్న శాతం ఆధారంగా లీటర్‌కు రూ.5 నుంచి రూ.7 వరకు పాడి రైతులకు అదనపు ఆదాయం లభిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణకు సంబంధించి దాదాపు 15 వేల మంది రైతులను గుర్తించి.. రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. అమూల్‌ సంస్థ 10 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లు చెల్లిస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లో ఆ మొత్తం జమ చేస్తోంది.

చదవండి: వ్యాక్సినేషన్‌ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్‌   
ఒక్కో అక్క చెల్లెమ్మకు రూ. 5 లక్షల నుంచి 15 లక్షల ఆస్తి: సీఎం వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top