టైమ్స్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ ఇందూ జైన్‌కు సీఎం జగన్ నివాళి

CM YS Jagan Pays Tribute To Times Group Chairperson Indu Jain - Sakshi

సాక్షి, అమరావతి: ఇటీవల మరణించిన టైమ్స్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ ఇందూ జైన్‌ సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొని ఇందూ జైన్‌కు నివాళులు అర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

టైమ్స్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ ఇందూ జైన్‌(84) కరోనా మహమ్మరి బారినపడి ఈ నెల 13న  కన్నుమూశారు. భారతదేశంలో మీడియా రంగంలో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1999లో గ్రూప్‌ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన జైన్‌, సంస్థ స్థాయిని పెంచడంలో కృషి చేశారు. 2000లో టైమ్స్‌ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో దేశంలోనే ఉత్తమ ఎన్‌జీవోగా తీర్చిదిద్దారు.

1983లో ఏర్పాటైన ఫిక్కి లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌వో) వ్యవస్థాపక ప్రెసిండెంట్‌గా వ్యవహరించారు. భారతీయ భాషా సాహిత్యాభివృద్ధిని కాంక్షిస్తూ తన మామ సాహు శాంతి ప్రసాద్‌ జైన్‌ స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ ట్రస్ట్‌కు 1999 నుంచి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్‌ ఏటా జ్ఞానపీఠ అవార్డులను అందజేస్తుంటుంది. 2016లో కేంద్రం ఆమెను పద్మ భూషణ్‌తో సత్కరించింది. 84 ఏళ్ల ఇందూ జైన్ మీడియా ప్రపంచంలోనే కాకుండా, అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

చదవండి: Cyclone Yaas: ఉత్తరాంధ్ర కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష
ఉచిత పంటల బీమా నగదు జమ చేసిన సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top