గిరిజనుల దశాబ్దాల కల సాకారం.. | CM YS Jagan Distributed ROFR Rails To Tribals | Sakshi
Sakshi News home page

గిరి పుత్రులకు అటవీ హక్కుల పత్రాల పంపిణీ 

Oct 2 2020 11:47 AM | Updated on Oct 2 2020 6:16 PM

CM YS Jagan Distributed ROFR Rails To Tribals - Sakshi

సాక్షి, అమరావతి: పోడు వ్యవసాయాన్ని నమ్ముకున్న దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతుల స్వప్నం గాంధీ జయంతి రోజున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారు. వారికి అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ ఆయన శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు ప్రభుత్వం 246.30 కోట్లు మంజూరు చేసింది. (చదవండి: గాంధీ అడుగు నీడలో పాలన : సీఎం జగన్‌)

తొలిసారిగా గిరిజన రైతులు సాగు చేసుకునే అటవీ భూములపై దివంగత వైఎస్సార్‌ హక్కు పత్రాలను అందచేశారు. 1,30,679 ఎకరాలకు సంబంధించి 55,513 ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలను ఆయన పంపిణీ చేశారు. తరువాత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమాన్ని విస్మరించాయి. ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మరోసారి అదే స్థాయిలో పంపిణీకి శ్రీకారం చుట్టింది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement