
Updates..
► కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు.
► ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇటీవల కేంద్రం రూ.10వేల కోట్ల రెవెన్యూ లోటు నిధుల విడుదల, పెండింగ్ నిధుల విడుదలపై సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.
► సీఎం జగన్ రేపు(శనివారం) నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు.
► సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు.
► ఢిల్లీలో సీఎం జగన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు స్వాగతం పలికారు.
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. రేపు(శనివారం) ఢిల్లీ వేదికగా జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం జగన్.. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఢిల్లీకి పయనమయ్యారు. రేపు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.