Prakasam District: AP CM Y. S. Jagan Condolences Over Prakasam District Bus Accident - Sakshi
Sakshi News home page

ప్రకాశం: దర్శి బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

Jul 11 2023 8:54 AM | Updated on Jul 11 2023 1:28 PM

Cm Jagan Condolences Over Prakasam District Bus Accident - Sakshi

సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు.
చదవండి: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

Advertisement
 
Advertisement
Advertisement