Chandrababu Rally High Tension In Gudivada - Sakshi
Sakshi News home page

చంద్రబాబు ర్యాలీ.. టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ..

Apr 13 2023 9:28 PM | Updated on May 19 2023 3:10 PM

Chandrababu Rally High Tension In Gudivada - Sakshi

గుడివాడ: చంద్రబాబు ర్యాలీ సందర్భంగా గుడివాడలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు గుడివాడలో ర్యాలీ చేస్తున్న సమయంలో నెహ్రూ చౌక్‌ వద్దకు రాగానే టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పిన్నమనేని, వెనిగండ్ల వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. 

అంతకుముందు వైఎస్సార్‌సీపీ కార్యక్తరలపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు.వైఎ‍స్సార్‌సీపీ జెండాను బైక్‌కు పెట్టుకుని వెళ్తున్న యువకుడిపై టీడీపీ కార్యకర్తలు అడ్డగించి కవ్వింపు చర్యలకు దిగారు. దీన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిలదీయడంతో వారిపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.  ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారీగా పోలీసులు మోహరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement