సాఫ్ట్‌వేర్ సంస్థకు అడ్డగోలుగా కాంట్రాక్టు
రూ.25 కోట్ల ప్రాజెక్టుకు దాదాపు రూ.43 కోట్లు
సాఫ్ట్‌వేర్ లోపాలపై ఫిర్యాదులు వస్తున్నా పట్టని వైనం
ప్రజాధనం వృథా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కన్సల్టేషన్లు, సాఫ్ట్‌వేర్ పేరిట ప్రజాధనం దురి్వనియోగం చేస్తోంది. ఇందులో కూడా మీకింత.. మాకింత అన్నట్టు దోచేసుకుంటున్నారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ సహకారం అందిస్తున్న సాఫ్ట్‌టెక్ అనే సంస్థకు కాంట్రాక్ట్ విలువ భారీ స్థాయిలో పెంచి, మరికొన్నేళ్లు కట్టబెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. సంబంధిత సంస్థకు ప్రతి ఐదేళ్లకు కాంట్రాక్టును పునరుద్ధరిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వంలో రూ.25 కోట్లతో తొలి ఐదేళ్లకు కాంట్రాక్టు అప్పగించారు. అయితే, గత ప్రభుత్వంలో ఎలాంటి అదనపు భారం లేకుండా పాత ధరతోనే పనులు అప్పగించారు. కానీ, కూటమి ప్రభుత్వం అదే సంస్థకు ఈసారి కాంట్రాక్టును భారీగా పెంచి కట్టబెట్టింది. తాజాగా ఐదేళ్ల కాల వ్యవధికి సాఫ్ట్‌వేర్ సహకారం అందించేందుకు దాదాపు రూ.43 కోట్లు కాంట్రాక్టు ఇచి్చంది.
సేవలు అరకొర... చెల్లింపులు ఘనం
అరకొర సేవలకు కూడా భారీస్థాయిలో ప్యాకేజీలు, కాంట్రాక్టులు కట్టబెట్టడం చంద్రబాబు సర్కార్‌కే చెల్లింది. ఈ క్రమంలోనే సాఫ్ట్‌టెక్ సంస్థకు కోట్ల రూపాయిల కాంట్రాక్ట్‌ను ధారపోసింది. కానీ, ఈ సంస్థ సేవలు మాత్రం పేలవంగా ఉన్నాయి. దాని సాఫ్ట్‌వేర్‌తో అనేక సమస్యలు వస్తున్నట్లు నిర్మాణదారులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
కాంట్రాక్టును దాదాపు రెట్టింపు చేసి
ఎక్కడైనా కాంట్రాక్టు ఇచ్చేందుకు గతంలో చేసిన పనులను బేరీజు వేసి ప్రస్తుత ధరల్లో గరిష్టంగా 5 లేదా 10 శాతం పెంపుతో ఇస్తారు. ఇక్కడ మాత్రం సాఫ్ట్‌టెక్‌కు అందుకు భిన్నంగా దాదాపు రెట్టింపు చేసి ఇచి్చనట్టు విశ్వసనీయ సమాచారం.
2015–19 మధ్య ఈ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు చెల్లించి దోపిడీకి పాల్పడింది. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రెట్టింపు దోపిడీకి తెరతీస్తూ సుమారు రూ.43 కోట్లు చెల్లిస్తున్నట్టు తెలిసింది. కేవలం సాఫ్ట్‌వేర్ అందించడానికి ఇంత పెద్దమొత్తం పెంచడంలో ఆంతర్యం ఏమిటనే చర్చ నడుస్తోంది.
దుబారా బాబు
ప్రజాధనాన్ని ప్రణాళికలు, సాఫ్ట్‌వేర్ పేరిట ఏజెన్సీలు, సంస్థలకు కట్టబెట్టడం చంద్రబాబుకు ఎప్పటినుంచో ఉన్న అలవాటేననే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు బీద అరుపులు అరుస్తూ, మరోవైపు ఊరూపేరులేని సంస్థలకు ప్రభుత్వ భూములు కట్టబెడుగూ.. ఇంకోవైపు ఎలాంటి ఉపయోగం లేని పనులకు డబ్బు వృథా చేయడం బాబు మార్కు పాలన అని ఆరి్థక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.


