
గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది.
సాక్షి, విజయవాడ: పరీక్ష వాయిదా కోసం గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనలు చేసినా కానీ చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయని ఏపీపీఎస్సీ.. ఏపీ ప్రభుత్వం రాసిన లేఖకు సమాధానం పంపింది. పరీక్ష నిర్వహించాలని అన్ని జిల్లాల అధికారులకు ఏపీపీఎస్సీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, గ్రూప్-2 వాయిదాపై చంద్రబాబు సర్కార్ డ్రామాకు తెరలేపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామా నడుపుతోంది.
లేఖలు, ఆడియో లీక్స్ పేరుతో టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారు. డ్యూటీ టైమింగ్స్ అయిపోవడంతో ఏపీపీఎస్సీ కార్యాలయం సిబ్బంది వెళ్లిపోయారు. కార్యాలయానికి తాళం వేసి ఉందని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. ఏపీపీఎస్సీ కార్యాలయానికి వచ్చి.. అభ్యర్థులు వెనుదిరుగుతున్నారు. విశాఖలో గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన ఉధృతం చేశారు. ఇసుక తోట నేషనల్ హైవేపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో చేస్తున్నారు.