కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్

Central Hydropower Department Video Conference On Krishna Water Dispute - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంచాయితీపై కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఉద్రిక్తతల తగ్గింపు అజెండాగా నాగార్జునసాగర్ డ్యాం, శ్రీశైలం డ్యాం నిర్వహణ బదిలీ  అంశం, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. సుమారు గంట పాటు సమావేశం కొనసాగింది. త్వరలోనే మీటింగ్‌ మినిట్స్‌ విడుదల చేస్తామని డబ్ల్యూసీ ఛైర్మన్‌ వెల్లడించారు.
చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్‌ ఎంత?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top