డ్రైవర్ సమయస్పూర్తి: ప్రాణాలు పోతున్నా..

సాక్షి, కృష్ణా : గుండెపోటు కారణంగా ప్రాణాలు పోతున్నా సమయస్పూర్తిగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు ఓ బస్సు డ్రైవర్. ఈ సంఘటన ఆదివారం జిల్లాలోని జి. కొండూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గంపలగూడెం మండలం పెనుగోలుకు చెందిన కృష్ణారావు అనే డ్రైవర్ నడుపుతున్న ఆర్టీసి బస్సు తిరువూరు నుంచి విజయవాడ బయలుదేరింది. జి. కొండూరు మండలం లక్కిరెడ్డి సమీపంలోకి రాగానే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ( పేర్నినానిపై హత్యాయత్నం: కొత్త కోణం..)
అయితే నొప్పి ప్రాణాలు తీస్తున్నప్పటికి స్టీరింగ్‌ను వదలక, సమయస్పూర్తితో బస్సును పక్కకు నిలిపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే డ్రైవర్ కృష్ణారావు బస్సులోనే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని పోలీసులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి