పరిహార బకాయిలను తక్షణమే విడుదల చేయాలి

Buggana Rajendranath Reddy Asks GST Council for Compensation arrears - Sakshi

జీఎస్టీ కౌన్సిల్‌ను కోరిన ఆర్థిక మంత్రి బుగ్గన

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రావాల్సిన పరిహార బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు. ఢిల్లీలో సోమవారం 42వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి బుగ్గన హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.67 లక్షల కోట్లు వ్యయం చేయగా, వాటిలో రాష్ట్రాలు రూ.40 లక్షల కోట్లు(60%), కేంద్రం రూ.27 లక్షల కోట్లు (40%) వ్యయం చేస్తున్నాయన్నారు. వాటిలో రక్షణ రంగం, ఇతరాలు తీసివేయగా కేంద్ర ప్రభుత్వం 35% మాత్రమే వ్యయం చేస్తోందన్నారు. అందువల్ల రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

► రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న పరిమితులకు రెండు శాతాన్ని అదనంగా రుణాన్ని సేకరించడానికి అనుమతులు ఇవ్వాలి. పరిహార బకాయిల విషయంలో ఎంత మేరకు రుణాన్ని సేకరించాలనే విషయంలో, 2019–20 ఆర్థిక సంవత్సరం అసలు వృద్ధిరేటు (సుమారు 3%)గా పరిగణించాలి. 
► జీఎస్టీ పరిహార విషయంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలను రుణంగా సేకరించినట్లయితే, బకాయిలను ప్రథమంగా చెల్లించాలి. తరువాత బకాయిల వడ్డీని, చివరి ప్రాధాన్యంగా బకాయిల అసలు చెల్లించాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top