ఇదొక అద్భుతమైన నిర్ణయం: బొత‍్స

Botsa Satyanarayana Praises CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారని మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క ఉచిత బోరు వేయించారా? అని  ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. బీసీల అభ్యున్నతికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.  బీసీలను ఓటు బ్యాంక్‌గానే చూశారు. ఆదరణ పథకం పేరుతో దోచుకు తిన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం. మేనిఫెస్టో మా పార్టీకి భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  చెప్పారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాత ఓటు అడగడానికి ప్రజలు ముందుకు వస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే జలకళ పథకాన్ని కూడా ప్రారంభించాం. నీరు-మీరు పథకంలో దోచుకున్న వాళ్లంతా ఇప్పుడు సిగ్గులేకుండా జలకళ మా పథకం అని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎవరికైనా ఉచితంగా బోర్ వేసిందా?  ఎవరికైనా ఉచితంగా మోటర్ ఇచ్చిందా?  రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ప్రభుత్వం మాది. 2004లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం మాత్రమే మేనిఫెస్టో పథకాలను అమలు చేసింది. వెనుకబడిన వర్గాలు రాజకీయంగా ఎదగడానికి కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. 

ఆ హామీని అమలు చేస్తూ  కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం నాకు గర్వంగా ఉంది.  చంద్రబాబులా ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే పార్టీ కాదు మాది.  బీసీలను చంద్రబాబు ఎప్పుడూ ఓటు బ్యాంకులానే చూశారు.  ఆదరణ పథకం పేరుతో దోపిడీ చేశారు.  మహిళా ఆర్థిక అభివృద్ధి కోసం మా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రిపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు కనుకే ఎన్నికల చరిత్రలో ఎవ్వరికి ఇవ్వనన్ని సీట్లు ఇచ్చి తమ తీర్పునిచ్చారు. మరొక వారం రోజుల్లో బీసీ కార్పొరేషన్ చైర్మన్‌ను నియమిస్తాం. ఇందులో సగ భాగం మహిళా చైర్మన్‌లు ఉంటారు. ఇది ఒక అద్భుతమైన నిర్ణయం’ అని అన్నారు. 

చదవండి: దశాబ్ధాల పోరాటానికి సీఎం జగన్‌ పరిష్కారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top