‘అమరావతి’ హైడ్రామా అట్టర్‌ ప్లాప్‌  | Bahujana Parirakshana Samithi Leaders Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘అమరావతి’ హైడ్రామా అట్టర్‌ ప్లాప్‌ 

Aug 9 2021 8:27 AM | Updated on Aug 9 2021 8:27 AM

Bahujana Parirakshana Samithi Leaders Fires On Chandrababu - Sakshi

రిలే దీక్షలో పాల్గొన్న బహుజన నేతలు  

అమరావతి బినామీ ఉద్యమకారులు 600వ రోజు పేరిట చేసిన ‘న్యాయస్థానం–దేవస్థానం’ హైడ్రామా అట్టర్‌ ప్లాప్‌ షో అయిందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు.

తాడికొండ: అమరావతి బినామీ ఉద్యమకారులు 600వ రోజు పేరిట చేసిన ‘న్యాయస్థానం–దేవస్థానం’ హైడ్రామా అట్టర్‌ ప్లాప్‌ షో అయిందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ఎద్దేవా చేశారు. తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 314వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో ఆదివారం  పలువురు నాయకులు ప్రసంగించారు. అమరావతి రెండేళ్ల క్రితం, సింగపూర్, అమెరికాలా ఉన్నట్లు.. ఇప్పుడు ఆ అభివృద్ధిని కోల్పోయినట్లు ఎల్లో మీడియా, పత్రికల్లో తప్పుడు కథనాలు వండివార్చడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

600వ రోజు పేరిట నిర్వహించిన ఉద్యమం అట్టర్‌ ప్లాప్‌ అయిందని, రైతుల ముసుగులో ఉన్న తెలుగుదేశం పార్టీ తొత్తులకు, చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.  అమరావతి బినామీలు 600 రోజుల పేరిట ‘న్యాయస్థానం–దేవస్థానం’ అంటూ  దొంగయాత్ర నిర్వహించడం నగుబాటుకు గురయ్యిందన్నారు. అమరావతి ప్రాంతంలో  సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే కరకట్ట అభివృద్ధితో పాటు ఇతర పనులు ప్రారంభమై చకచకా కొనసాగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. నాయకులు పరిశపోగు శ్రీనివాసరావు, మాదిగాని గురునాథం , బేతపూడి రాజేంద్ర, ఆకుమర్తి చిన్నా, బూదాల సలోమీ, పులి జస్వంత్‌ రాణి, ఇందుపల్లి సుభాషిణి, ఓలేటి స్వప్న, శామ్యూల్, పల్లె బాబు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement