ఒక్క కులానికే కాపు కాసి పేదలను రోడ్డున పడేసిన చంద్రబాబు | Bahujana Parikshana Samithi Leaders Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఒక్క కులానికే కాపు కాసి పేదలను రోడ్డున పడేసిన చంద్రబాబు

Jan 2 2021 4:26 AM | Updated on Jan 2 2021 4:26 AM

Bahujana Parikshana Samithi Leaders Comments On Chandrababu - Sakshi

మాట్లాడుతున్న మాదిగాని గురునాథం

తాడికొండ: చంద్రబాబు కేవలం ఒక్క కులానికే కాపు కాస్తూ పేదలు ఇతర వర్గాలను రోడ్డున పడేసేలా వ్యవహరించడం సిగ్గుచేటని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఎస్సీ, ఎస్టీ, సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు మాదిగాని గురునాథం అన్నారు. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 94వ రోజు రిలే నిరాహార దీక్షలకు ఆయన శుక్రవారం హాజరై ప్రసంగించారు.

ప్రజాస్వామ్యయుతంగా 151 ఎమ్మెల్యే సీట్లతో ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చంద్రబాబు కోర్టుల్లో తప్పుడు కేసులు వేయిస్తున్నారని దుయ్యబట్టారు. తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని దీక్షలు చేస్తున్న దళితులపై చులకనగా మాట్లాడుతూ, మహిళలపై దాడులు చేయించింది చాలక ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తుండటం దారుణమన్నారు. కార్యక్రమంలో బేతపూడి సాంబయ్య, ఊపూరి ఆదాం, దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement