రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి | Bahujan Parirakshana Samiti Leaders Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి

Mar 2 2021 4:27 AM | Updated on Mar 2 2021 4:27 AM

Bahujan Parirakshana Samiti Leaders Comments On Chandrababu - Sakshi

దీక్షల్లో పాల్గొని నిరసన తెలియజేస్తున్న బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు

తాడికొండ:  పంచాయతీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న చంద్రబాబు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర పన్నుతున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 153వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా చంద్రబాబు పర్యటన పేరిట అనుమతులు లేకుండా వెళ్లడమేగాక రాజకీయ లబ్ధి కోసం ఎయిర్‌పోర్టుల్లో నిరసనల పేరిట ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందే కుట్ర చేస్తున్నాడన్నారు. బహుజనుల హక్కులను హరించేలా బాబు కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే భవిష్యత్తులో బహుజనులు టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement