AP: ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌.. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా ఛార్జీలు తగ్గింపు

APSRTC Reduced Ticket Charges In AC Buses Till September 30 - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌ అందించింది. బస్సులు ఛార్జీలు తగ్గిస్తున్నట్టు ఏపీఎస్‌ఆర్టీసీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా చార్జీలను 20 శాతం వరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 30వరకూ చార్జీల తగ్గింపు అమలులో ఉండనున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది. కాగా.. రూట్లు, చార్జీలు ఎంత తగ్గించాలనే నిర్ణయం ఆర్‌ఎంలకు అప్పగించినట్టు స్పష్టం చేసింది. 

బస్సుల్లో తగ్గించిన చార్జీలు ఇవే..
- అమరావతి, గరుడ, వెన్నెల బస్సు చార్జీల్లో 10 శాతం తగ్గింపు
- విజయవాడ-విశాఖ డాల్ఫిన్‌ క్రూజ్‌ బస్సుల్లో 20 శాతం తగ్గింపు
- హైదరాబాద్‌-విజయవాడ ఏసీ బస్సుల్లో 10 శాతం తగ్గింపు
- విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు బస్సుల్లో 20 శాతం తగ్గింపు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top