APSRTC: ఫేస్‌బుక్‌ పోస్ట్‌కు స్పందించిన ఆర్టీసీ అధికారులు

APSRTC Officials Responded To The Facebook Post - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రయాణికుల అభ్యర్థనలకు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. ఫేస్‌ బుక్‌ పోస్ట్‌కు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించారు. 40 మంది ఉన్నాం మాకో బస్సు ఏర్పాటు చేయాలంటూ ఎస్‌. వెంకటరావు అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు. వెంకటరావు అభ్యర్థనకు సత్వరమే స్పందించిన ఆర్టీసీ ఈడీ బ్రహ్మనందరెడ్డి.. పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్లకు బస్సు ఏర్పాటు చేశారు.

కాగా, ప్రజా రవాణా సంస్థ ప్రయాణికుల కోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) మెరుగు పరుచుకునేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే సీనియర్‌ సిటిజన్ల (వయో వృద్ధులు)కు టిక్కెట్‌లో 25 శాతం రాయితీ కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు మరికొన్ని రాయితీలను కల్పించింది.
చదవండి: ఆర్టీసీలో ఆఫర్లు.. టిక్కెట్‌లో 25 వరకు శాతం రాయితీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top