APO Return Letter To The Person For Asking Right to Information Act - Sakshi
Sakshi News home page

ఖర్చవుతుంది మరి.. సహ’ దరఖాస్తుదారుడికి షాకిచ్చిన ఏపీవో ఆశారాణి

Dec 24 2021 3:01 AM | Updated on Dec 24 2021 8:27 AM

APO Return Letter To The Person For Asking Right to Information Act - Sakshi

చెన్నయ్యకు ఏపీవో నుంచి అందిన నోటీసు

ఎర్రావారిపాళెం: ఉపాధి పనులకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి రూ.4.53 లక్షల డీడీ పంపాలంటూ ఏపీవో తిరుగుటపా పంపారు. చిత్తూరు జిల్లా చింతగుంట పంచాయతీ పసుపులేటివారిపల్లికి చెందిన చెన్నయ్య తమ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి 2009వ సంవత్సరం నుంచి వివరాలు కావాలని ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశారు.

సదరు వ్యక్తికి ఏపీవో ఆశారాణి.. సమాచారం పంపేందుకు రూ.4.53 లక్షలు డీడీ పంపాలని తిరుగుటపా పంపడంతో దరఖాస్తు దారుడు నివ్వెరపోయాడు. దీనిపై ఏపీవోను వివరణ కోరగా.. 2009 నుంచి అన్ని ప్రింట్ల జిరాక్స్‌లు తీసి ఇవ్వాలంటే అంతే అవుతుందని సూపరింటెండెంట్‌ లెక్కించినట్టు చెప్పారు. 

చెన్నయ్యకు ఏపీవో నుంచి అందిన నోటీసు 

Advertisement
 
Advertisement
Advertisement