AP: ప్రాణదాతలపై అసత్య ప్రచారాలు | AP YSR Health Care Trust Fact Check On Eenadu 108 False Stories | Sakshi
Sakshi News home page

ఏపీ: ఆపదలో ఆదుకునే ప్రాణదాతలు.. ఈనాడువేమో పరమ చీపు రాతలు

Jan 18 2023 8:02 PM | Updated on Jan 18 2023 8:14 PM

AP YSR Health Care Trust Fact Check On Eenadu 108 False Stories  - Sakshi

ప్రాణం పోకుండా కాపాడుతున్న ప్రాణ దాతలపై యెల్లో మీడియా అడ్డగోలు రాతలతో.. 

సాక్షి, గుంటూరు: టీడీపీ అనుకూల మీడియా దేన్ని వదలడం లేదు. సీఎం వైఎస్‌ జగన్‌ సారథ్యంలోని సంక్షేమ ప్రభుత్వంపై విషం చిమ్మడమే ధ్యేయంగా పెట్టుకుంది యెల్లో మీడియా. అందునా చంద్రబాబు-రామోజీల ఈనాడు మరీ దారుణం. అందుకే లేనిది ఉన్నట్లు కథనాలు అల్లేసుకుని.. వాటిని తమ మీడియాలో ప్రచురించుకుని ఆనందం పొందుతున్నారు. అయితే వాస్తవాలు వెలుగు చూస్తుండడంతో.. నాలుక కర్చుకోవడం ఈనాడు వంతు అవుతోంది.

తాజాగా ‘ఆపదలో ఆంబులెన్స్‌’ అంటూ ప్రభుత్వ ఆంబులెన్స్‌ సర్వీసులపై ఈనాడు ఓ కథనం ప్రచురించింది. పైగా ఆంబులెన్స్‌లు టైంకి రావడం లేదంటూ, మూలనపడ్డాయంటూ అందులో లేనిపోని పైత్యాన్ని ప్రదర్శించింది. అయితే.. వాస్తవం ఏంటంటే.. 108 సర్వీస్‌ ద్వారా నెలకు లక్ష దాకా ప్రాణాలు కాపాడగలుగుతోంది ప్రభుత్వం. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. 108సర్వీస్‌కు సంబంధించిన ఆంబులెన్స్‌లు 768 ఉన్నాయి. వీటిలో ప్రస్తుత ప్రభుత్వం 432 ఆంబులెన్స్‌లను కొత్తగా కేటాయించినవే ఉన్నాయి. వీటి సేవల్లోనూ ఎలాంటి అవాంతరాలు ఎదురు కావడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో.. నిబంధనల ప్రకారం అయితే 20 నిమిషాల్లో, అర్బన్‌ ఏరియాల్లో 15, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో 108 సేవలు అందుబాటులో ఉండాలి. కానీ, తాజా లెక్కలను పరిశీలిస్తే.. కేవలం 16, 14, 22 నిమిషాల్లో సేవలను అందించేందుకు అందుబాటులో ఉంటోంది 108 సర్వీసెస్‌. గమ్యస్థానం మరీ దూరంగా ఉండడం, ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి ఈ వాహనాలు త్వరగతినే సేవలను అందిస్తున్నాయి. 

నాడు-నేడు
గత ప్రభుత్వంలో.. 440కి గానూ 336 ఆంబులెన్స్‌లు మాత్రమే రోడ్డెక్కేవి. లక్షా ఇరవై వేల జనాభాకు ఒక ఆంబులెన్స్‌ సేవలు అందిచేది. 86 ఆంబులెన్స్‌ల్లో మాత్రమే అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ వ్యవస్థ ఉండేది. అందులో అడ్వాన్స్‌డ్‌ వెహికిల్‌ లొకేషన్‌ సిస్టమ్‌(AVLS),మొబైల్‌ డాటా టర్మినెల్‌ కూడా ఉండేది కాదు. కానీ, ఇప్పటి ప్రభుత్వ హయాంలో.. 768 ఆంబులెన్స్‌లు ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో స్టాండర్డ్స్‌కు దగ్గరగా జనాభాకు తగ్గ రీతిలో ఆంబులెన్స్‌ 74 వేలమందికి ఒకటి అందుబాటులో ఉంటోంది. అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ ఆంబులెన్స్‌లు 216 ఉండగా, అందులో 130 కొత్తవి. అన్ని ఆంబులెన్స్‌లో మొబైల్‌ డాటా టర్మినెల్‌ ఉంది. అడ్వాన్సడ్‌ వెహికిల్‌ లొకేషన్‌ సిస్టమ్‌ ఆంబులెన్స్‌ల సంఖ్య దాదాపుగా అన్ని ఆంబులెన్స్‌ల్లో ఉంది. 

పాత ఆంబులెన్స్‌లు విషయంలో..
2019నాటికి ఉన్న 108 సర్వీసు ఆంబులెన్స్‌ల సంఖ్య 440గా ఉండగా, 2022 నాటికి 768కి చేరింది. వీటిల్లో 2020లో 412 కొత్త ఆంబులెన్స్‌లను రోడ్డెక్కించింది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం. కిందటి ఏడాదిలో 20 కొత్త ఆంబులెన్స్‌లను గిరిజన ప్రాంతాల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఇప్పుడున్న 108 ఆంబులెన్స్‌ల్లో.. 336 పాత ఆంబులెన్స్‌లు(గత ప్రభుత్వ ఘనకార్యమే) ఉన్నాయి. వీటిని మార్చేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. జనవరి 11 2023వ తేదీన ఆరోగ్య, కుటుం సంక్షేమ శాఖ జీవో విడుదల అయ్యింది కూడా. ఈ మేరకు 146 ఆంబులెన్స్‌ల కొనుగోలుకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది కూడా. 

శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఓ ఘటనను ఈనాడు కథనం ప్రముఖంగా ప్రచురించింది. ఏపీ16టీహెచ్‌9940 నంబులపూలకుంటకు చెందిన ఆంబులెన్స్‌ ఆగిపోయిందని వెల్లడించింది. అయితే.. తాజాగా ప్రభుత్వం రీప్లేస్‌మెంట్‌ కోసం ఇచ్చిన 146 ఆంబులెన్స్‌ల్లో ఇది కూడా ఒకటి ఉంది. అప్పటికే 4,86,599 కిలోమీటర్లు తిరిగిన ఆ వాహనం.. మోటార్‌ ఇష్యూతో ఆగిపోయింది. జనవరి 13వ తేదీ మధ్యాహ్నాం ఒంటి గంట నుంచి ఆ మరుసటి రోజు సాయంత్రం దాకా అది అలాగే ఉండిపోయింది. రీప్లేస్‌ అయిన వెంటనే కొత్త వాహనం ఆ ప్రాంతంలో సేవలు అందిస్తుందని అధికారులు వెల్లడించారు.

ఇక 104 ఎంఎంయూ సేవల విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 292 104ఎంఎంయూ వాహనాలు ఉండగా.. ప్రస్తుతం హయాంలో ఆ సంఖ్య 656గా ఉంది. నెలలో 26 రోజుల పాటు సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో సేవలు అందిస్తున్నాయి ఇవి. ఇక త్వరలో ప్రారంభించనున్న ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాంలో భాగంగా.. అన్ని పీహెచ్‌సీల డాక్టర్లు 104ఎంఎంయూ ద్వారానే సేవలు అందించనున్నారు. ఇందు కోసం 260 కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేయడం జరిగింది. విషయం ఏంటంటే.. 2022 అక్టోబర్‌ 21వ తేదీ నుంచి ఈ పథకం పైలట్‌ ప్రాజెక్టుగా అమలులో ఉంది కూడా. త్వరలో పూర్తి స్థాయిలో అమలు కాబోయే ఈ పథకం గురించి కూడా ఈనాడుకు ఏమాత్రం అవగాహన లేన్నట్లుంది. 

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌(ఐఏఎస్‌) ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement