ఏపీ ట్రాన్స్‌కో కొత్త సబ్‌ స్టేషన్లు | AP Transco New Sub Stations: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీ ట్రాన్స్‌కో కొత్త సబ్‌ స్టేషన్లు

Nov 6 2024 6:20 AM | Updated on Nov 6 2024 6:20 AM

AP Transco New Sub Stations: Andhra Pradesh

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో  ఐదు నూతన సబ్‌ స్టేషన్లను ప్రారంభించడంతో పాటు, 14  సబ్‌ స్టేషన్లు, లైన్లకు సీఎం చంద్రబాబు ఈ నెల 7న భూమి పూజ చేయనున్నారని  ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ట్రాన్స్‌ కో సీఎండీ కె.విజయానంద్‌ వెల్లడించారు. సీఆర్డీఏ పరిధిలో 400/220 కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌ స్టేషన్‌(జీఐఎస్‌) ప్రారంభానికి సంబంధించి తాళ్లాయపాలెంలో సీఎం కార్యక్రమ ఏర్పాట్లను విజయానంద్‌ మంగళవారం పరిశీలించి విద్యుత్‌ శాఖ అధికారులకు తగు సూచనలు చేశారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మిగతా నాలుగు సబ్‌ స్టేషన్లను తాళ్లాయపాలెం నుంచి వర్చువల్‌ విధానంలో సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే మొత్తం 14 సబ్‌ స్టేషన్లు , లైన్ల నిర్మాణాలకు సంబంధించి భూమి పూజ కూడా చేస్తారని చెప్పారు. రూ.5407 కోట్లతో ఎన్టీఆర్, గుంటూరు, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, అనకాపల్లి, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల పరిధిలోని 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, వివిధ సామర్థ్యాలతో సబ్‌ స్టేషన్లు, లైన్లను నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు విజయానంద్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement