పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వార్తలు.. పాపమంతా నారాయణ సిబ్బందిదే

AP Tenth Class Question Paper Leakage Narayana College Chittoor - Sakshi

సాక్షి, కర్నూలు: ఏపీ పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాల్‌ ప్రాక్టిస్‌లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందిదే ప్రధాన పాత్రగా తేల్చారు. దీనికి సంబంధించిన వాట్సాప్‌ చాట్‌ కూడా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు పదో తరగతి పరీక్షా పత్రాల మాల్‌ప్రాక్టీస్‌లో తిరుపతి నారాయణ కాలేజీ వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌రెడ్డిని నిందితుడిగా గుర్తించారు.

అలాగే తిరుపతి ఎన్‌ఆర్‌ఐ కాలేజ్‌ లెక్చరర్‌ సుధాకర్‌ను నిందితులుగా గుర్తించారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు. నారాయణ విద్యాసంస్థల  అధినేత గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆనాడు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్చగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే మాదిరిగా అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నించగా పోలీసులు వాటిని అడ్డుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తులోఆడుకునే ప్రయత్నాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

చదవండి: (గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిసిన సీఎం జగన్‌ దంపతులు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top