
సాక్షి, తాడేపల్లి: ప్రజలే ప్రభుత్వంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దతు పలుకుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా మెగా పీపుల్స్ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది.
ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్లలో మేళతాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు.
గ్రామాలు మొదలు పట్టణాల వరకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ నినాదం మార్మోగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల కుటుంబాల సర్వే పూర్తయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా 55 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి.
చదవండి: కన్నతల్లి లాంటి ఏపీని విమర్శిస్తే పవన్‌కు బాధ లేదా?: పేర్ని నాని