హౌసింగ్‌ అధికారుల సర్దుబాటు | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌ అధికారుల సర్దుబాటు

Published Tue, Apr 5 2022 4:37 AM

AP Housing Department Adjust Head Of Authorities In 26 Districts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటైన 26 జిల్లాల ఆధారంగా అధికారులను సర్దుబాటు చేస్తూ గృహ నిర్మాణ శాఖ నిర్ణయం తీసుకుంది. కొత్త పోస్టులు సృష్టించకుండా, ఉన్న కేడర్‌ను సర్దుబాటు చేశారు. ప్రతి జిల్లాకు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ),  సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) స్థాయి అధికారులను డిస్ట్రిక్ట్‌ హెడ్‌ హౌసింగ్‌ అధికారులుగా నియమించింది.

ఇప్పటివరకూ ప్రతి జిల్లాకు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఎస్‌ఈ హోదా అధికారి కొనసాగారు. ఇకపై ఎస్‌ఈ, సీనియర్‌ ఈఈలు డిస్ట్రిక్ట్‌ హెడ్‌ హౌసింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు 26 జిల్లాలకు డిస్ట్రిక్ట్‌ హెడ్‌ హౌసింగ్‌ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది.


Advertisement
 
Advertisement
 
Advertisement