అభ్యంతరాలను తెలుపుతూ లేఖ రాయండి: హైకోర్టు

AP High Court Orders AG To Write A Letter SEC On Local Body Elections - Sakshi

సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈక్రమంలో ఎన్నికల నిర్వహణపై తాము నివేదించిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) కోర్టుకు తెలిపారు. ఎన్నికల తేదీ పైనే కాదు ఎన్నికలు జరగాల్సిన నెల పైన కూడా చర్చించాలని అన్నారు. దీంతో ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు తెలుపుతూ మూడు రోజుల్లో  ఎన్నికల కమిషనర్‌కు ఒక లేఖ రాయమని హైకోర్టు ఏజీని ఆదేశించింది.

అంతేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారులంతా ఎన్నికల కమిషన్‌తో చర్చించాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక ఎన్నికల నిర్వహణా వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధంకాగా.. కరోనా పరిస్థితులు, ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నందున ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top