సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్‌ | AP EAMCET From September 17 to 25th | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్‌

Aug 15 2020 4:56 AM | Updated on Aug 15 2020 4:56 AM

AP EAMCET From September 17 to 25th - Sakshi

సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల తాజా షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంసెట్, సహా వివిధ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ముందు షెడ్యూళ్లు ఇచ్చినా కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి.

సెప్టెంబర్‌ మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించాలని, అక్టోబర్‌ 15 నుంచి తరగతులు ప్రారంభించాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి తాజా షెడ్యూల్‌ను రూపొందించింది. ఇలా ఉండగా, ఈ ఏడాది ఏపీ ఐసెట్‌ను ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. 64,822 మంది దరఖాస్తు చేసుకున్నారని ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 45 పట్టణాల్లో నాలుగు సెషన్స్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement