కరోనాతో ఎంసెట్‌ రాయలేకపోయిన వారికి మరో ఛాన్స్‌ | AP EAMCET 2020 Students Who Had Corona Get Another Chance Retest | Sakshi
Sakshi News home page

కరోనాతో ఎంసెట్‌ రాయలేకపోయిన వారికి మరో అవకాశం

Sep 29 2020 8:53 AM | Updated on Sep 29 2020 9:19 AM

AP EAMCET 2020 Students Who Had Corona Get Another Chance Retest - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి : క్వారంటైన్‌లో ఉండి ఎంసెట్‌ రాయలేకపోయిన విద్యార్థులకు మరోసారి ఆ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ ఎంసెట్‌ చైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు తాము పరీక్ష రాయలేకపోయామని, మరోసారి అవకాశం కల్పించాలని కోరినట్టు పేర్కొన్నారు. అలాంటి వారు ఏపీ ఎంసెట్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ మెయిల్‌ ఐడీ helpdeskeamcet2020@gmail.com‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. (చదవండి: దేశంలో విద్య వ్యాపారమైపోయింది)

అదే విధంగా ఎంసెట్‌ హాల్‌ టికెట్, కోవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టులను ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పంపించాలని సూచించారు. వీరికి ఆన్‌లైన్లో పరీక్ష నిర్వహించే తేదీని ఎంసెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలియచేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వి.రవీంద్ర తెలిపారు. వివరాలకు 0884–2340535, 2356255ను సంప్రదించాలని ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement