చిరంజీవికి సీఎం వైఎస్‌ జగన్‌ విషెస్‌ | AP CM YS Jagan Wishes To Chiranjeevi On His Birthday | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలి: సీఎం జగన్‌

Aug 22 2020 7:51 PM | Updated on Aug 23 2020 10:20 AM

AP CM YS Jagan Wishes To Chiranjeevi On His Birthday - Sakshi

సాక్షి, అమరావతి: మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని ఆకాంక్షించారు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో చిరంజీవిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్‌ శనివారం ట్వీట్‌ చేశారు.(అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు : సీఎం జగన్‌)

కాగా నేడు చిరంజీవి 65వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యుల నుంచి సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.(చిరు బర్త్‌డే.. ఉపాసన ఎమోషనల్‌ ట్వీట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement