రేపు వైఎస్సార్ జగనన్న ఇళ్ల ప్రారంభోత్సవం

సాక్షి, అమరావతి: రేపు(గురువారం)వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నూతన ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. 28 లక్షల 30 వేల మందికి పక్కాఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. తొలి విడతగా 15 లక్షల 60 వేల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. రూ.51 వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, మౌలిక వసతుల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
సంబంధిత వార్తలు