లోకేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు | AP CID Filed MEMO On Nara Lokesh Comments At Yuvagalam | Sakshi
Sakshi News home page

లోకేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు

Dec 22 2023 1:22 PM | Updated on Dec 22 2023 5:24 PM

AP CID Filed MEMO On Nara Lokesh Comments At Yuvagalam - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సీఐడీ అందజేసింది. కాగా యువగళం‌ ముగింపు సందర్బంగా పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్కిల్‌ స్కాం కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారు. 

చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు రిమాండ్ విధించడం తప్పని అన్నారు. ఏసీబీ న్యాయమూర్తి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ సీఐడీ తన మెమోలో పేర్కొంది. స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కామ్ తదితర కేసులలో అప్పటి సీఎంహోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని.. తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్‌పీసీ క్రింద వాంగ్మూలం ఇచ్చారు. 
చదవండి: బెడిసికొట్టిన యువగళం ముగింపు సభ ప్లాన్‌.. 

అయితే ఆ వాంగ్మాలాలు ఇవ్వడాన్ని లోకేష్ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అధికారులు 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని.. రెడ్ బుక్‌లో  పేర్లు రికార్డు చేశానని, తమ‌ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్‌ హెచ్చరించారు. 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం కాగా దీన్ని సైతం‌ లోకేష్ తప్పుబట్టడంపై న్యాయవర్గాలలో విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షుల బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించాలని లోకేష్ ఉద్దేశంగా సీఐడీ మెమోలో పేర్కొంది. గతంలో లోకేష్‌కు జారీ చేసిన 41ఏ  నోటీసుల్లో పేర్కొన్న షరతులకుcrime in విరుద్దమని సీఐడీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement