శ్రీవారిని దర్శించుకున్న సోము వీర్రాజు | AP BJP Chief Somu Veerraju Visits Tirumala For Darshan | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న సోము వీర్రాజు

Nov 12 2020 8:57 AM | Updated on Nov 12 2020 10:51 AM

AP BJP Chief Somu Veerraju Visits Tirumala For Darshan - Sakshi

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు.  ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలోనే సహజ వనరులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, అభివృద్ధికి స్వామివారు ఆశీర్వదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఏపీని నెం.వన్‌ రాష్ట్రంగా తీర్చిద్దాడానికి అనేక రంగాలు ఉన్నాయన్నారు. రాయలసీమను రతనాల సీమగా, ఉత్తరాంధ్రలో అద్భుతమైన భూసంపద, మధ్యాంద్రలో నీటి వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంతటి మంచి వనరులు కలిగిన ప్రాంతాన్ని రాష్ట్ర అభివృద్ధికి పాలకులు ముందుకు రావాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, పరిపాలకులకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని స్వామివారిని ప్రార్ధించినట్లు సోము వీర్రాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement