AP Budget: రూ.41,436 కోట్లతో వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌

Ap Agriculture Budget 2023 24 Highlights - Sakshi

సాక్షి, అమరావతిరూ.41,436 కోట్ల రూపాయలతో ఏపీ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతు భరోసా కేంద్రాల వద్ద బ్యాంకింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నామని కాకాణి అన్నారు. ‘‘రైతుల ఆదాయం పెంచే విధంగా ఆర్భీకే సేవలు అందిస్తున్నాయి. రైతులకు కావాల్సిన అన్ని సేవలను గ్రామస్థాయిలోనే అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 8,837 ఆర్బీకే భవనాలు వివిధ స్థాయిలో ఉన్నాయి. ఆర్మీకేలను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నాం యూట్యూబ్‌ ఛానళ్లు, మాస పత్రికను ప్రారంభించాం’’ అని మంత్రి కాకాణి అన్నారు.

155 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది
రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.6940 కోట్లు అందించాం.
రైతు భరోసా, కిసాన్‌ యోజన కింద రూ. 7,220 కోట్లు
రైతులకు యూనివర్శల్‌ బీమా పథకం కల్పించిన ఏకైక రాష్ట్రం ఏపీ
ఏపీ సీడ్స్‌కు జాతీయ స్థాయిలో అవార్డులు
విత్తనాల రాయితీకి రూ.200 కోట్లు
ఆర్బీకేల ద్వారా రూ.450 కోట్ల విలువైన ఎరువులు సరఫరా

ఆర్భీకేల్లో 50వేల టన్నుల ఎరువులను నిల్వ చేస్తున్నాం
వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశాం
పంటల ప్రణాళిక, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల పర్యవేక్షణ
మా ప్రభుత్వంలో రైతులు ఎక్కడా కరవు, కాటకాలను ఎదుర్కోలేదు
వాటర్‌ గన్స్ అవసరమే రాలేదు. వర్షాలు సమృద్ధిగా కురిశాయి
రూ.6.01 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేశాం
9 లక్షల మంది కౌలు రైతులకు లబ్ధి చేకూరింది

వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశాం
3.50 లక్షల మంది సన్నకారు రైతులకు సబ్సిడీపై స్ప్రేయర్లు
డ్రోన్ల ద్వారా పురుగుల మందు పిచికారి చేసేలా చర్యలు
ఆర్భీకేల ద్వారా 10 వేల డ్రోన్లను రైతులకు అందిస్తాం
చిరుధాన్యాల సమగ్ర సాగు విధానం తీసుకొచ్చాం
చిరుధాన్యాల సాగు హెక్టార్‌కు రూ.6వేల ప్రోత్సాహకం
రాష్ట్రంలో పట్టు పరిశ్రమ ప్రగతి పథంలో ఉంది
ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటున్నాం

రైతు భరోసా కింద ఇప్పటివరకు రూ.6940 కోట్లు
ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా 1.61 లక్షల మంది రైతులకు లబ్ధి
మార్కెటింగ్‌ శాఖ అభివృద్ధికి రూ. 513.74 కోట్లు

సహకారశాఖకు సంబంధించి రూ. 233.71 కోట్లు
సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల అభివృద్ధికి రూ.100 కోట్లు
ఆహార పరిశ్రమల ప్రోత్సహకాలకు రూ.146.41 కోట్లు
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కోసం రూ.286.41 కోట్లు
ఆచార్య ఎన్జీరంగా వర్శిటీకి రూ.472.57 కోట్లు
వైఎస్సార్‌ ఉద్యాన విశ్వ విద్యాలయానికి రూ.102.04 కోట్లు
ఆంధ్రప్రదేశ్ మత్స్య వర్శిటీకి రూ.27.45 కోట్లు
వెంకటేశ్వర పశువైద్య వర్శిటీకి రూ.138.50 కోట్లు
వైఎస్సార్‌ పశునష్టం పరిహారం కోసం రూ.150 కోట్లు
పశువుల వ్యాధి నిరోధక టీకాలకు రూ.42.28 కోట్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top