సంప్రదాయ మందుగా వాడవచ్చు

Anilkumar Singhal says Anandaiah medicine can be used as a traditional medicine - Sakshi

ఆయుర్వేద మందుగా గుర్తించలేదు

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేసిన మందును సంప్రదాయ మందుగా వాడవచ్చని, దాన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడంలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు.మందు వాడకం వల్ల లాభం గురించి కాకుండా, ఎలాంటి నష్టాలు జరగలేదని భావించి ఆమోదం ఇచ్చామన్నారు. సోమవారం ఆయుష్‌ కమిషనర్‌ కల్నల్‌ రాములుతో కలిసి మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు.  మందులో వాడుతున్న పదార్థాల్లో హానికారకాలు లేవని తేలిందని చెప్పారు. కోవిడ్‌ వైరస్‌ నియంత్రణకు పనిచేస్తుందన్న ఆధారాలు కూడా ఏమీ లేవని, ఎవరి నమ్మకాన్ని బట్టి వారు వాడుకోవచ్చని పేర్కొన్నా రు. ఇతర మందులు వాడుతున్న వారు వాటిని వాడుతూనే ఈ మందును కేవలం సప్లిమెంట్‌గా వాడాలని సూచించారు.  పాజిటివ్‌ పేషెంట్లెవరూ క్యూలలో లేకుండా వారి సహాయకులు వచ్చి మందు తీసుకెళ్లడం మంచి దని,కంట్లో వేసే మందుకు అనుమతి లేదన్నారు.

కర్ఫ్యూతో కేసులు తగ్గుముఖం
కర్ఫ్యూ కారణంగా కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గతంలో కొన్ని పత్రికలు 144 సెక్షన్‌ అమలు, కర్ఫ్యూపై మీడియాలో విమర్శలు చేశాయని, కానీ ఇప్పుడు ఈ విధానమే మంచి ఫలితాలనిచ్చిందని చెప్పారు. అందుకే జూన్‌ 10 వరకు కర్ఫ్యూ పొడిగించామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు ఇదే మొదటిసారి అని తెలిపారు. రూ.7,880 కోట్లతో నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీల్లో 14 కాలేజీలకు సోమవారం శంకుస్థాపన చేశారని, రెండు కాలేజీలకు ఇంతకుముందే శంకుస్థాపన చేశారని చెప్పారు.

రాష్ట్రంలో 1,179 మంది బ్లాక్‌ఫంగస్‌ బాధితులున్నారని, వీరిలో 97 మంది పూర్తిగా కోలుకోగా, 14 మంది మృతిచెందారని తెలిపారు. 1,179 మందిలో 40 మంది మినహా మిగతావారు కరోనా సోకినవారేనని చెప్పారు. బ్లాక్‌ఫంగస్‌ కేసుల్లో 370 మంది ఆక్సిజన్‌ సపోర్టు తీసుకున్న వారు, 687 మంది స్టెరాయిడ్స్‌ వాడిన వారు ఉన్నారని తెలిపారు. మధుమేహ బాధితులు 743 మంది ఉన్నారన్నారు. కోవిడ్‌ కేసులు బాగా తగ్గుముఖం పట్టడంతో ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్‌ బెడ్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు బాగా డిమాండు తగ్గిందన్నారు. ఆక్సిజన్‌ స్టోరేజీ సామర్థ్యం తక్కువగా ఉండటంతో రోజుకు 590 మెట్రిక్‌ టన్నులు మాత్రమే తెస్తున్నామని, ఆక్సిజన్‌ వినియోగం కూడా తగ్గిందని తెలిపారు.

10 రోజుల్లోనే ప్రక్రియ పూర్తిచేశాం
ఆయుష్‌ కమిషనర్‌ కల్నల్‌ రాములు మాట్లాడుతూ కృష్ణపట్నం మందుపై తమశాఖ ఈనెల 21, 22 తేదీల్లో పరిశీలన మొదలుపెట్టిందని చెప్పారు. చెప్పినట్లుగానే అన్ని పరిశీలనలు పూర్తిచేసి 10 రోజుల్లో ఫలితాలు ఇచ్చామన్నారు. దీన్నిబట్టి ఈ మందుపై ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. చట్టం, శాస్త్రం ప్రకారం దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించలేదని, స్థానిక, సంప్రదాయ మందుగానే ఇవ్వాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. కోవిడ్‌ నిబంధనల మేరకు ఈ మందును పంపిణీ చేయాలన్నారు. ఆనందయ్యతో మాట్లాడిన తరువాత మందు పంపిణీపై తేదీలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

01-06-2021
Jun 01, 2021, 09:49 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో విడత కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నాయి....
01-06-2021
Jun 01, 2021, 06:11 IST
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణకు 5 రకాల మందులు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.   1....
01-06-2021
Jun 01, 2021, 06:04 IST
సాక్షి, అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 45 ఏళ్లు దాటిన వారిలోనే అధికంగా నమోదవుతున్నాయి. మధుమేహం ఉండి కరోనా వచ్చిన...
01-06-2021
Jun 01, 2021, 05:42 IST
సాక్షి,న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల...
01-06-2021
Jun 01, 2021, 05:23 IST
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కరోనా నుంచి తొమ్మిది రోజుల పసికందును విశాఖ వైద్యులు రక్షించారు. 26 రోజుల చికిత్స అనంతరం...
01-06-2021
Jun 01, 2021, 04:42 IST
మంచం పట్టిన భర్త.. దివ్యాంగురాలైన కూతురు.. వయసు పైబడిన అత్త.. అందరి భారం ఆమెపైనే.. తన రెక్కల కష్టంపై అందరినీ...
01-06-2021
Jun 01, 2021, 04:26 IST
కరోనా వైరస్‌ వ్యాప్తి ఏడాదిన్నర కింద చైనాలో మొదలై.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మొదట్లో కరోనా కేసులు భారీగా నమోదై తగ్గిన...
01-06-2021
Jun 01, 2021, 04:19 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లందరికీ టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 3వ...
01-06-2021
Jun 01, 2021, 04:06 IST
సాక్షి, హైదరాబాద్‌: 18004194961. ఇది కోవిడ్‌–19 టీకా కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యాలు లేకున్నా...
01-06-2021
Jun 01, 2021, 04:05 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను జూన్‌ 10 వరకు కొనసాగించాలని...
01-06-2021
Jun 01, 2021, 03:59 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కోవిడ్‌ టీకా విధానంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీకా విధానంలోని...
01-06-2021
Jun 01, 2021, 03:04 IST
జెనీవా: భారత్‌లో తొలుత వెలుగుచూసిన కోవిడ్‌ వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కప్పా, డెల్టా అనే...
01-06-2021
Jun 01, 2021, 02:55 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ కరాళనృత్యం మే నెలలో స్పష్టంగా కనిపించింది. దేశంలో సెకండ్‌వేవ్‌లో కరోనా విజంభృణ పెరగడంతో నమోదైన మొత్తం...
31-05-2021
May 31, 2021, 17:12 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వైరస్‌, బ్లాక్‌ఫంగస్, బాధితులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలపైన సోమవారం...
31-05-2021
May 31, 2021, 15:37 IST
సాక్షి,బళ్లారి(కర్ణాటక): కరోనా కష్టకాలం ఓ కుటుంబానికి కడుపుకోత తీర్చింది. 13 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన కుమారుడు లాక్​డౌన్​ కారణంగా తిరిగి అమ్మ...
31-05-2021
May 31, 2021, 14:56 IST
పట్నా: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ను పాటిస్తున్నాయి.  దీని​ వలన...
31-05-2021
May 31, 2021, 13:55 IST
ఆస్రేలియా(కాన్బెర్రా): నెల రోజుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆస్ట్రేలియా క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌ సోమవారం తన కుటుంబాన్ని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను...
31-05-2021
May 31, 2021, 03:49 IST
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం...
31-05-2021
May 31, 2021, 03:38 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యల వల్ల సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కేంద్ర...
31-05-2021
May 31, 2021, 02:59 IST
సాక్షి, హైదరాబాద్‌:     కోవిడ్‌ టీకా తీసుకోవా లనుకునేవారు తమ పేరును ఇక పోస్టాఫీసు నుంచి కూడా నమోదు చేసుకోవచ్చు....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top