వైఎస్సార్‌ బీమా నమోదు ప్రారంభం

Andhra Pradesh: YSR Bima Scheme 2023 Registration Begins Updates - Sakshi

ఈనెల 7లోగా నమోదు పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశం 

‘కుటుంబ పెద్ద’ సహజ మరణమైతే రూ.లక్ష పరిహారం

ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత వైకల్యం చెందినా రూ.5 లక్షలు

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం అమలు..

దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు వర్తింపు

సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్‌ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కుటుం­బాన్ని పోషి­ంచే వ్యక్తి సహజంగా లేదా ప్రమాద­వశాత్తు మరణిస్తే.. ఆ కుటు­ం­బాలకు ప్రభు­త్వం వైఎ­స్సార్‌ బీమా అందజేస్తోంది.

గత నెల 29న నమోదు ప్రక్రియ ప్రారంభమ­వ్వగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్లు వివరా­లను నమోదు చేస్తున్నారు. ఈ నెల 7లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయా­లని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.­జవహర్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్‌ బీమా పథకాన్ని 2021 జూలై 1న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

కాగా, 2023–24కు సంబంధించి జూలై 1 నుంచి వైఎస్సార్‌ బీమా పథకం అమలుకు కార్మిక శాఖ ఉత్తర్వులిచ్చింది. 18–50 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద సహజంగా మర­ణిస్తే వైఎస్సార్‌ బీమా కింద రూ.లక్ష పరి­హారంగా అందజేస్తారు. అలాగే 18–70 ఏళ్ల­లోపు వయసున్న కుటుంబ పెద్ద ప్రమాద­వశాత్తూ మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తారు.

బీమా కంపెనీలు, బ్యాం­కులతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే పరి­హా­రం చెల్లింపును ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.372 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top