సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం

గ్రంథాలయ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై హర్షం
సాక్షి, అమరావతి: జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడంపై రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయం వద్ద రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు ఆధ్వర్యంలో సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో సమానంగా జిల్లా గ్రంథాలయ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం సీఎం గొప్ప మనస్సుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వెన్నుదన్నుగా ఉంటామని గ్రంథాలయ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పూర్ణమ్మ, కార్యదర్శి రవికుమార్, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు