ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల

Andhra Pradesh Lawcet results released - Sakshi

యూనివర్సిటీ క్యాంపస్‌: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో 3, 5 ఏళ్ల ఎల్‌ఎల్‌ బీ, 2 ఏళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి గ త నెల 22న నిర్వహించిన ఏపీ లాసెట్‌–2021 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌  హేమచంద్రారెడ్డి తిరుపతిలో గురువారం విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏపీ లాసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మూడు కోర్సుల్లోనూ మహిళలే మొదటి ర్యాంకులు సాధిం చారని తెలిపారు. వర్సిటీ వీసీ డి.జమున, లాసెట్‌ కన్వీనర్‌ చంద్రకళ, రెక్టార్‌ డి.శారద, రిజిస్ట్రార్‌ మమత పాల్గొన్నారు. 

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో హరిప్రియకు మొదటి ర్యాంకు
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో మోపూరు హరిప్రియ (విజయవాడ రూరల్‌) మొదటి ర్యాంకు పొందారు. ఏపీ ట్రాన్స్‌కోలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మోపూరు హరిప్రియ 53 ఏళ్ల వయసులో ఈ ర్యాంక్‌ సాధించడం విశేషం ఎల్‌.రాజా (గుంటూరు) రెండో ర్యాంకు, కె.హరికృష్ణ (అనంతపురం) మూడో ర్యాంకు సాధించారు. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకి సంబంధించి ఎం.మౌనిక బాయి (బనగానపల్లె, కర్నూలు జిల్లా) మొదటి ర్యాంకు పొందారు. వి.నాగసాయి ప్రశాంతి (రణస్థలం, శ్రీకాకుళం జిల్లా) రెండో ర్యాంకు, సునీల్‌ (పూసపాటిరేగ, విజయనగరం జిల్లా) మూడో ర్యాంకు సాధించారు. ఇక రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం ప్రవేశపరీక్షలో వై.గీతిక (విశాఖపట్నం) మొదటి ర్యాంకు పొందారు. కె.కృష్ణమ నాయుడు (ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా) రెండో ర్యాంకు, టి.రమేష్‌ బాబు (విజయవాడ) మూడో ర్యాంకు సాధించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top