Agnipath Protests: Sai Defence Academy Director In AP Police Custody - Sakshi
Sakshi News home page

Agnipath Protests: ఏపీ పోలీసుల అదుపులో సాయి ఢిపెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌

Jun 18 2022 9:40 AM | Updated on Jun 18 2022 2:33 PM

Agnipath Protests: Sai Defence Academy Director In AP Police Custody - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై దాడి వెనుక సహకారం ఉందని భావిస్తున్న సాయి ఢిపెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులను రెచ్చగొట్టాడనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు ఆయనను ఖమ్మం జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి సుబ్బారావును నరసరావుపేట తరలించారు.

ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసుల విచారణంలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిల్‌లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేటు ఆర్మి కోచింగ్ అకాడమీలు సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్‌ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు. 

చదవండి: (సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనక సంచలన విషయాలు) 

Advertisement
 
Advertisement
Advertisement