జీవో నంబర్‌-1పై హైకోర్టులో విచారణ.. వాదనలు వినిపించిన ఏజీ

AG Arguments In High Court On Petition Of AP G.O Number-1 - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జీవో నంబర్‌-1పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సీపీఐ రామకృష్ణ కోర్టును కోరారు. ఈ క్రమంలో ఈ పిటిషన్‌ను అత్యవసరంగా తీసుకోనక్కర్లేదని ఏజీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న చెంచ్‌కు పిల్‌ను విచారించే అధికారం లేదని ఏజీ స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో పిల్‌ను తామే అత్యవసరంగా విచారిస్తామని వెకేషన్‌ కోర్టు తెలిపింది. కాగా, హైకోర్టులో విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదు. వెకేషన్‌ బెంచ్‌ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదు. జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోంది అని స్పష్టం చేశారు. 
 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top