ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ | Aarogyasri Services Will Be Suspended In Andhra Pradesh From Tomorrow Over Pending Payments, More Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

Mar 31 2026 5:02 PM | Updated on Mar 31 2026 5:30 PM

Aarogyasri services will be suspended in Andhra Pradesh from tomorrow

సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. ఆషా ప్రతినిధుల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలు ఆసుపత్రులకు చెల్లించలేదు. బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.

చంద్రబాబు సీఎం అయ్యాక రెండోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం మోసం చేసిందని వారు ఆరోపించారు. గతంలో సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చినా, మార్చి 31 వచ్చినా బకాయిలు చెల్లించలేదని ఆషా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement