వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఆధార్‌ నమోదు

Aadhaar registration at home for elderly and disabled - Sakshi

మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ

సాక్షి, అమరావతి: వయోవృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగపీడితులకు తమ ఇంటి వద్దే ఆధార్‌ నమోదు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. ఈ విధానాన్ని బుధవారం నుంచే ఆందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు, ఇతర అవసరాలకు ఆధార్‌ తప్పనిసరి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

వయోవృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగపీడితులు తమ సమాచారాన్ని ఈ–మెయిల్‌ ద్వారా యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) రీజనల్, రాష్ట్ర కార్యాలయాలకు అందిస్తే ఏడు పనిదినాల్లో వారి ఇంటికే వెళ్లి ఆధార్‌ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇంటికే వెళ్లి ఆధార్‌ నమోదు చేసినందుకు అదనపు సర్వీస్‌ చార్జీలు వసూలు చేస్తారు.

ఒక అడ్రెస్‌ ఉన్న ఇంటిలో మొదటి వ్యక్తికి రూ.700, ఆ తర్వాత ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి రూ.350 చొప్పున జీఎస్‌టీతో కలిపి సేవా రుసుం వసూలు చేస్తారు. యూఐడీఏఐ ప్రాంతీయ, రాష్ట్ర కార్యాలయాలను https://www.uidai.gov.in/en/ contact&­support/regional&offices. html  అనే వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించాలని సూచించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top