ఏపీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

74th Independence Day celebrations In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఏపీలో శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శాసనసభా ప్రాంగణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు, అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు. 

శాసన మండలి ఆవరణలో మండలి చైర్మన్ షరీఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లమ్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు ధనుంజయ్ రెడ్డి, సాల్మన్ ఆరోఖ్య రాజ్, జే మురళి, సీఎస్ఓలు జోషి, పరమేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

సచివాలయ ఆవరణలో సీఎస్‌ నీలం సాహ్ని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జీఏడీ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top