నెట్టికంటుడి హుండీ కానుకల లెక్కింపు
గుంతకల్లు రూరల్: మండలంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ గురువారం జరిగింది. 51 రోజులకు గాను రూ. 44,91,833 నగదు, అన్నదానం హుండీ ద్వారా రూ.1,46,732 నగదు సమకూరింది. అలాగే 2 గ్రాముల బంగారు, 450 గ్రాముల వెండితో పాటు నేపాల్ కరెన్సీ 1, 7 అమెరికన్ డాలర్లు, 4 లిబియా దినార్‌ను స్వామి హుండీలో భక్తులు కానుకలుగా సమర్పించారు. ఈ ప్రక్రియను ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఆలయ ఈఓ ఎం.విజయరాజు, ఏఈఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది పర్యవేక్షించారు. కసాపురం గ్రామ ప్రజలు, గుంతకల్లు హనుమాన్ సేవాసమితి, కర్నూలు బాలాజీ సేవా సమితి, నంద్యాల శీరామ సేవాసమితి, బళ్లారి వీరభద్రసేవా సమితి సభ్యులు పాల్గొని పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మద్య హుండీ కానుకలను లెక్కించారు.


