నెయ్యి కాదు.. బాబు అండ్ కో బుర్రలే కల్తీ
● సీబీఐ నివేదికతో కుట్రలు పటాపంచలు
● మాజీ మంత్రి సాకే శైలజానాథ్
అనంతపురం: నెయ్యి కాదు.. సీఎం చంద్రబాబు అండ్ కో బుర్రలే కల్తీ అంటూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్‌లో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి శైలజానాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరి కాయలు కొట్టారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ అధికార మదంతో చంద్రబాబు అండ్ కో బుర్రలు కల్తీ అయ్యాయని మండిపడ్డారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం తిరుమల లడ్డూపై విష ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం క్షమించరానిదన్నారు. సీబీఐ నివేదికతో చంద్రబాబు కుట్రలన్నీ పటాపంచలయ్యాయన్నారు. అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారని విమర్శించారు. అబద్ధాలు చెప్పడం, పదేపదే వల్లె వేయడం, గోబెల్స్ ప్రచారం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లా డుతూ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని తేలిందని, ఇప్పటికై నా చంద్రబాబు కళ్లు తెరిచి తిరుమల పవిత్రతను కాపాడాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, టీటీడీ మాజీ సభ్యుడు అశ్వర్థ నాయక్, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతు న్నాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య, పార్టీ సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, జాహ్నవి, దేవి, మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షులు రాధా యాదవ్, శోభాబాయి,భారతి, హాజరబీ, చంద్ర కళ, ఉష, లీలావతి, జిల్లా కార్యదర్శి మల్లెల వేణుగోపాల్, ఇంటెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానీషా, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా భేగ్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గువ్వల రాజేష్ రెడ్డి, నగర ఎస్సీ సెల్ అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమర్‌నాథ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు సాకే కుళ్లాయిస్వామి, ఎం. శ్రీనివాసులు, అనిల్ కుమార్ గౌడ్, సాకే అశోక్ కుమార్ పాల్గొన్నారు.


