దేశ సమగ్రత కోసమే గాంధీజీ సందేశ యాత్ర
● సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి
● సంఘీభావం తెలిపిన మాజీ ఎంపీ తలారి రంగయ్య
మడకశిర రూరల్: దేశ సమగ్రత కోసమే మహాత్మాగాంధీ సందేశ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టినట్లు సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని నీలకంఠాపురం గ్రామం నుంచి ఆయన చేపట్టిన మమాత్మాగాంధీ సందేశ యాత్ర రెండో రోజు గురువారం బుళ్లసముద్రం గ్రామం నుంచి కొనసాగింది. వేకువజామున యోగాసనాలతో తన దినచర్యను ప్రారంభించిన ఆయన ఆరుబయలులో వాటర్ ట్యాంక్ వద్దనే చన్నీటి స్నానం చేశారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. సూర్య విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మహాత్మాగాంధీ సిద్దాంతాలైన శాంతి, సత్యం, సోదరభావాన్ని చాటి చెబుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఇంటింటికీ గాంధీ సందేశాన్ని వివరిస్తూ పాదయాత్ర కొనసాగించారు. కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడ్డుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
తలారి రంగయ్య సంఘీభావం...
కళ్యాణదుర్గం రూరల్: గాంధీజీ సందేశ యాత్రకు అనంతపురం మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు స్థానిక ఆ పార్టీ నేతలు ఉన్నారు. పాదయాత్రగా అగ్రంపల్లి వద్దకు చేరుకున్న రఘువీరారెడ్డిని కలసి శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రసాదాన్ని అందజేశారు. గాంధేయ మార్గంలో సాగుతున్న ఈ యాత్ర నిర్విఘ్నంగా సాగాలని, ప్రజల్లో శాంతి సందేశాన్ని నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు చంద్రశేఖర్‌రెడ్డి, గోళ్ల సూరి, ఎంఎస్‌రాయుడు, కె. హనుమంతురాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కోనాపురం గంగాధరప్ప, ఎంపీపీ నాగరాజు, దొడగట్ట నారాయణ, రామాంజనేయులు, పాలాక్షి, వన్నూర్రెడ్డి, రామ్మోహన్; దొడగట్ట మురళి, సర్పంచ్ విజయ్, భీమప్ప, బసవరాజు, అశోక్‌రెడ్డి, పాతలింగ, నరేష్, వేణుచౌదరి, బిక్కి హరి, షెక్షావలి, బొమ్మయ్య, అనిల్. తదితరులు పాల్గొన్నారు.


